టాలీవుడ్ నటీమణి కస్తూరి గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా దూసుకుపోతున్నది ఈ సీనియర్ నటి. కొంతమంది హీరోయిన్ లు ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో ఒకటి రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు కానీ ఇంకొంతమంది వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు అందులో ఒకరు కస్తూరి. ప్రస్తుతం బుల్లితెర పైన కూడా ఆమె దూసుకుపోతున్నారు.

ఆ విధంగా తెలుగులో టాప్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్న ఓ సీరియల్ లో కస్తూరి నటిస్తూ అభిమానులను పొందుతుంది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కస్తూరి ప్రేక్షకులను ఎంతగానో ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే తమ పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నారని చెప్పాలి. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ను ప్రేక్షకులు కార్తీకదీపం తర్వాత అత్యంత ఎక్కువగా ఆదరించడం విశేషం. 

ఇక ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతో లీనమై పోయి వీక్షిస్తున్నారు. ఈ సీరియల్ లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు డైరెక్టర్ విజయ్ కృష్ణ, నిర్మాత ప్రభాకర్. ఈ సీరియల్ దర్శకుడు బుల్లితెర నటి హీరోయిన్ భావన కి భర్త అవుతాడు. ఆమె కళ్యాణ వైభోగం యమలీల సీరియల్స్ లో నటిస్తుంది. ఇక గతంలో కూడా చాలా వాటిలో నటించారు ఆమె. అంతేకాదు విజయకృష్ణ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో పాటు దేవత అనే సీరియల్ ని కూడా దర్శకత్వం వహిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు తమిళ సీరియల్స్ కి డైరెక్టర్ గా చేస్తున్నాడు అయితే బుల్లితెర మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రభాకర్ తన భార్య పేరిట సీరియల్ నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: