సినీ పరిశ్రమలో హీరోయిన్ లు రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ విధంగా చాలామంది హీరోయిన్ లు తమలో నటన ఉన్న లేకున్నా కూడా అదృష్టం తిరిగి స్టార్ హీరోయిన్ లు గా ఎదిగి ఆ తర్వాత నటిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. టాలెంట్ ఉన్న కూడా వారికి అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. దాంతో వారికి సినిమా అవకాశాలు తగ్గి క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమైన పోతున్నారు.  అలాంటి నటీమణులలో ఒకరు రెజీనా. తమిళ సినిమా ల ద్వారా సినిమా ల్లోకి ప్రవేశించి  తెలుగులో ఎస్ ఎమ్ ఎస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది.

తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఆమె ఉత్తమ డెబ్యూ నటి అవార్డు కూడా అందుకోవడంతో ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. దానికి తోడు వరుస సినిమా అవకాశాలు కూడా రావడం తో ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది. రొటీన్ లవ్ స్టోరీ, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు ఆమెకు హిట్ ను అందించగా ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ గా మిగిలి పోవడంతో ఆమెకు అవకాశాలు రావడం తగ్గాయి. 

దాంతో ఆమె మెల్లమెల్లగా టాలీవుడ్ కి దూరమై పోయింది. ఇతర భాషలలో సినిమా అవకాశాలు రావడంతో ఆమె అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె ఆచార్య సినిమాలో ఓ కీలక పాటలో చేస్తోంది. అంతేకాకుండా రెండు చిన్న సినిమాలలో కూడా నటిస్తుంది. తమిళంలో అయితే మంచి సినిమాల్లో ఆమె నటిస్తోందని తెలుస్తోంది. అంతే కాకుండా హిందీలో కూడా ఆమె ఓ సినిమా లో నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ చత్రపతి రీమేక్ లో కూడా ఆమె హీరోయిన్ గా  ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. చూస్తుంటే రెజీనా మెల్ల మెల్లగా తన కెరీర్ని గాడిలో పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: