గాయకుడు, పాటల రచయిత జై సీన్... షారూఖ్ ఖాన్, కాజోల్ సూపర్‌హిట్ పాట 'మెహందీ లగా కే రఖ్నా' ను తనదైన శైలిలో అందించారు. ఇది చూసిన ఇంటర్నెట్ వినియోగదారులకు నవ్వు ఆగడం లేదు. సీన్ పాట సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించారు. అంతేనా ఇంగ్లీష్ లో పాడితే ఎలా ఉంటుందో పాడి చూపించాడు. "దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే" సినిమాలోని హిట్ ట్రాక్ "మెహందీ లాగా కే రఖ్నా" అనే హిందీ పాటను ఆంగ్లంలో పాడే వీడియోను పోస్ట్ చేస్తూ "దాదాపు ఒకేలా కాదు. నేను ఈ పాటను శాశ్వతంగా నాశనం చేసినట్లయితే క్షమాపణలు కోరుతున్నాను. అయితే అవి నాకు జోకులు ఇస్తాయి... కాబట్టి నేను వీటిని చేస్తూనే ఉంటాను" అంటూ జై సీన్ సింగ్ కామెంట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో దావానలంలా వ్యాపించింది. గంటల్లోనే 2 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. ఈ హిస్టీరికల్ పాట అనువాదం జే సీన్ ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

"మెహందీ లగా కే రఖ్నా"ను లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ పాడారు. సంగీత కూర్పు జతిన్-లలిత్. ఆనంద్ బక్షి సాహిత్యం అందించారు. షారుఖ్, కాజోల్‌తో పాటు ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, ఫర్దీ దలాల్, మందిరా బేడి, అనుపమ్ ఖేర్, పర్మీత్ సేతి కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా మూవీ లవర్స్ హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

ఈ వైరల్ వీడియో పై ప్రియాంక చోప్రా కూడా "హాహాహా" అంటూ ఫన్నీగా స్పందించారు. సినిమాల షూటింగ్ కారణంగా ప్రియాంక లండన్‌లో ఉన్నారు. 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్నారు. ఇది కాకుండా ఆమె 'టెక్స్ట్ ఫర్ యు'లో సామ్ హ్యూఘన్, సెలిన్ డియోన్‌తో కలిసి కనిపిస్తుంది. కీను రీవ్స్‌తో ఆమె 'మ్యాట్రిక్స్ 4'లో కనిపించనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: