ప్రస్తుత కాలంలో సినిమా తారలకు మించి టీవీ తారలకు మంచి గుర్తింపు వస్తుంది. పారితోషికం కూడా వారికి తగ్గట్లుగానే అందుకుంటున్నారు. కొందరు నటీనటులకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. పలు సీరియల్స్ ద్వారా ఎక్కువ గుర్తింపు దక్కించుకుని సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు వీరు.  అలా బుల్లితెర సీరియల్ లలో చాలా సంవత్సరాలు నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుని కోట్లాది మంది అభిమానులను మార్చుకుంది నటి భావన.

సీరియల్స్ లో మంచి మంచి పాత్రలతో నటించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించి భావన అందరిని మెప్పించడం జరిగింది. ఆమె రోజూ 20 నుంచి 25 వేల రూపాయల దాకా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తుండగా తనకున్న క్రేజ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి సీరియల్ ప్రొడ్యూసర్ లు సైతం డిమాండ్ ఉన్న నటీనటులకు అడిగినంత పారితోషికం ఇస్తుంటారు. ఆ విధంగా భావన కు ఉన్న క్రేజ్ ను బట్టి ఆమె డిమాండ్ చేసినంత పారితోషకాన్ని అందిస్తూ ఉంటారు మన నిర్మాతలు. 

భావన చాలా సంవత్సరాల నుంచి సీరియల్ లో బిజీగా ఉండడంతో ఆమె ఎక్కువ మొత్తంలో సంపాదించారని చాలామంది భావిస్తుండటం సహజమే. అలా ఆమె ఓ సందర్భంలో తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ఒక రోజుకు 5 నుంచి 7 వేల రూపాయల దాకా ఇస్తారని అది కూడా అన్ని ఖర్చులతో కలిపి ఇది ఉంటుందనీ  ఆమె చెప్పారు. అయితే సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని ఛారిటీ కి ఖర్చు చేయడం ద్వారా భావన మంచి పేరును తెచ్చుకున్నారు. తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం డబ్బులు ఖర్చు చేయకుండా క్యాన్సర్ ఆసుపత్రి రోగులకు ఖర్చు చేస్తూ మంచి మనసు చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వస్తే సాయం చేస్తూ భావన మానవతా దృక్పథంతో మనిషిగా వారికి సహాయం చేస్తూ గొప్ప పేరును సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: