దేశం గర్వించదగ్గ నటుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఇంగ్లిష్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దానయ్య డివివి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది అక్టోబర్ 13 న రిలీజ్ చేయబోతున్నారు.ఇక ఈ సినిమా నుంచి విడుదలైన రెండు టీజర్లు ఒకటి భీమ్ ఫర్ రామరాజు,రెండోది రామరాజు ఫర్ భీమ్ ఇంకా ఒక మేకింగ్ వీడియో పెద్ద హిట్స్ అయ్యి సినిమాపై భారీ అంచనాలని పెంచేశాయి.

ఇక అలాగే మొన్న ఫ్రెండ్షిప్ డే సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దోస్తీ పాటని యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిఫరెంట్ సింగెర్స్ ని పెట్టి చాలా కొత్తగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ అయిన క్షణాల్లోనే ఈ పాట అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకొని యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ అయితే యూ ట్యూబ్ లో రికార్డులు నమోదుచేస్తుంది. విడుదలయ్యి 3 రోజులైనా కాని రికార్డు వ్యూస్ తో ఆదరగొడుతుంది. మూడు రోజుల్లోనే కోటి వ్యూస్,6లక్షలకు పైగా లైక్స్ అందుకొని యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 గా దూసుకుపోతుంది.ఇక ఈ సినిమాని బాహుబలి కంటే ఎక్కువ థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇక చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో..


https://youtu.be/VPT_EIo89cc

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr