వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ ఈసారి మ్యాస్ట్రో సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. చెక్, రంగ్ దే వంటి సినిమాలు ఆయనకు భారీ నిరాశనే మిగిల్చాయి. కాగా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమాలు అలా అయిపోవడం ఆయన అభిమానులు ఎంతగానో నిరాశ పరిచింది. దాంతో ఈ సారి చేయబోయే సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని నితిన్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాను తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ అంధుడి గా నటిస్తుండగా హీరోయిన్ గా నాభ నటేష్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన వక్కంతం వంశీ నా పేరు సూర్య సినిమా తో తొలిసారి మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. సినిమా ఫలితం కొంత తేడా వచ్చిన కథా రచయితగా ఫెయిల్ కాలేదు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు నితిన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే నితిన్ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే ఓ మంచి కథను చెప్పి ఆయనను ఒప్పించాడు వంశీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. 

నవంబర్ లో మొదలయ్యే ఈ సినిమా యొక్క శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ ఆల్ ఇండియా వైజ్ గా అన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ మాత్రమే నిర్మాతల వద్ద  ఉన్నాయి. టోటల్ నాన్ థియేట్రికల్  హక్కుల కింద 20 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ తీసుకున్నట్లు చెబుతున్నారు. మీడియా రేంజ్ హీరో కావడంతో ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే చాలు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు పూజ హెగ్డే ను హీరోయిన్ గా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఈ సినిమాకు హీరోయిన్ గా చేస్తే కలెక్షన్లు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: