
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిని తెలుగులో హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చి హిట్ సాధిస్తున్నారు. గతంలో రీమేక్ సినిమా అంటే యాజ్ టీజ్ గా తెరకెక్కించే వారు. కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలో ని మెయిన్ పాయింట్ తీసుకొని దానికి ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్చి హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా చేంజెస్ చేసి ఆ సినిమాలను తెరకెక్కించి హిట్ సంపాదిస్తున్నారు. అలా ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో పెంచిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా తెలుగులో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు సాధించింది. రీమేక్ అయినా అన్ని భాషలలో ఈ చిత్రం హిట్ అయినట్లుగానే తెలుగులో కూడా బంపర్ మెజారిటీతో హిట్ అందుకుంది. అయితే ఏ భాషలో చేయని ఓ చిన్న ప్రయోగం వకీళ్ సాబ్ సినిమాలో చేశారు తెలుగు నిర్మాతలు. ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ను యాడ్ చేసి హీరో పాత్ర ను సెంటిమెంటల్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సినిమాలో అది తప్ప మిగతా అంతా బాగుందని ప్రేక్షకులు తేల్చేశారు. తాము ఏదైతే బాగా వర్కౌట్ అవుతుందో అని భావించిన ఎపిసోడ్ ప్రేక్షకులను నచ్చకపోవడంతో తప్పు చేశామన్న భావన మేకర్స్ లో ఏర్పడింది.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ఇప్పుడు చిరంజీవి కూడా చేయబోతున్నాడని టాలీవుడ్ విమర్శకులు అంటున్నారు. ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మలయాళ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది అని చెబుతున్నారు. మాతృకలో హీరోగా నటించిన మోహన్ లాల్ సరసన ఏ హీరోయిన్ కూడా నటించలేదు. అసలు హీరోయిన్ పాత్ర అనేది సృష్టించలేదు. కానీ తెలుగులో చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్రను సృష్టించారు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అని టాలీవుడ్ వుడ్ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.