
టాలీవుడ్ లో ఏ హీరో కి లేని బ్యాడ్ లక్ ఒక నాచురల్ స్టార్ నాని కే ఎదురవుతుంది. అదేమిటంటే సరిగ్గా ఆయన సినిమా విడుదలయ్యే సమయానికి కరోనా ఎక్కువవడం, థియేటర్లు మూసివేయడం, సినిమా విడుదల ఆగిపోవడం, క్రేజ్ తగ్గిపోవడం, చివరికి ఎలాంటి క్రేజ్ లేకుండా ఓటీటీ లో సినిమా విడుదల కావడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తాను విభిన్నమైన పాత్రలో చేసిన వి సినిమా ఎప్పుడు ఓ టీ టీ లో విడుదల అయింది. గత సంవత్సరం కరోనా మొదటి దశ విజృంభిస్తుండడంతో నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా ఆ కారణంగా ఆ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
దాంతో బ్యాడ్ లక్ అనుకుని నాని తన తదుపరి సినిమాకి వెళ్ళి పోయాడు. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేశాడు. రీతు వర్మ హీరోయిన్ గా తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. అయితే రెండో దశ కరోనా కారణంగా థియేటర్ లు మళ్లీ మూసుకుపోవడంతో ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడక తప్పలేదు. ఇప్పుడు థియేటర్ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్లకు రాని కారణంగా ఈ సినిమాను మళ్ళీ ఓ టీ టీ లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా నానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని భావిస్తున్నారు సినిమా ప్రేక్షకులు. అంతేకాకుండా ఇదొక బ్యాడ్ సెంటిమెంట్ గా కూడా పరిగణిస్తున్నారు. వరుసగా రెండు సినిమాలు ఓ టీ టీ కి రావడమంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా నాని పై ఓ టీ టీ స్టార్ అనే ముద్ర పడిపోయే అవకాశం ఉంది. మరి దాని తర్వాత సినిమాలైనా శ్యామ్ సింగ రాయ్ అలాగే అంటే సుందరానికి సినిమాలైనా ఆయనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయా చూడాలి.