-
allari naresh
-
Andhra Pradesh
-
Cinema
-
Daggubati Venkateswara Rao
-
festival
-
India
-
January
-
Joseph Vijay
-
kalyan
-
keerthi suresh
-
krishnam raju
-
mahesh babu
-
media
-
October
-
parasuram
-
Pawan Kalyan
-
Pooja Hegde
-
Prabhas
-
producer
-
Producer
-
ram pothineni
-
Ravi
-
ravi teja
-
RRR Movie
-
Tamil
-
Telugu
-
thaman s
-
Tollywood
-
UV Creations
-
varun tej
-
Vemuri Radhakrishna
-
Venkatesh
అయితే వీటిలో ముందుగా విడుదల అనౌన్స్ చేసిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తొలిసారిగా కలిసి నటిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ ని నాగవంశీ నిర్మిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ దీనిని పాన్ ఇండియా మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 14 న విడుదల కానుంది.
అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, రెండు రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న కథనాలను బట్టి అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరికి వాయిదా పడిందని, త్వరలో లేటెస్ట్ విడుదల తేదీపై అధికారిక అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాల యూనిట్స్ ఇటీవల ముందుగానే ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య ని సంప్రదించిన అనంతరమే తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించాయని, ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనుక వాయిదా పడితే జనవరి తరువాతనే దాని విడుదల ఉంఢే అవకాశం ఉంటుందని టాక్. మరి అసలు రాబోయే జనవరికి ఏ ఏ సినిమాలు పక్కాగా థియేటర్స్ లో విడుదలవుతాయో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ..... !! 
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి