ఇటీవలె కాలంలో బయోపిక్ సినిమాలు తెరకెక్కడం ఎక్కువయ్యాయి. తెలుగులో మహానటి సినిమాతో బయోపిక్ సినిమాలు రావడం మొదలు కా గా ఆ తర్వా త ఎంతో మంది మహానుభావుల జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు సినిమాల రూపంలో తీసుకువచ్చారు. అయితే పొలిటికల్ లీడర్ చిత్రాలు ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం చూస్తున్నాం. హిందీలో తెలుగులో తమిళంలో కూడా రాజకీయ నాయకుల బయోపిక్ లు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

హిందీలో స్పోర్ట్స్ బయోపిక్స్ కి అద్భుతమైన ఆదరణ దక్కించుకోవడం మాత్రమే కాదు సూపర్ హిట్ టాక్ వస్తున్నాయి.  తెలుగులో సినీ తారల జీవిత విశేషాలను చూపిస్తుండగా తమిళంలో పొలిటికల్ బయోపిక్ లు వస్తున్నాయి. అయితే ఇటీవలే జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాను విడుదల చేయగా ఆ చిత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. బాక్సాఫీస్ వద్ద అందరికీ నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఇకపై బయోపిక్ సినిమాలు చేయడం ఆపేస్తే మంచిది అని సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతుంది. ఇలాంటి సినిమాల వల్ల ఉన్న పేరు పోతుంది అనే ఉద్దేశంతో వారు ఈ విధమైన వార్త ను స్ప్రెడ్ చేస్తున్నారు.

సగం తెలిసి సగం తెలియని తనంతో వారు సినిమాల ద్వారా గొప్ప గొప్ప వారి కథలు చెప్పి వారి వీర గాథలను నార్మల్ కథలు గా మిగిలి పోయేలా చేస్తున్నారు. కొత్తగా గొప్ప పేరు అవసరం లేదు ఉన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై వచ్చే బయోపిక్ సినిమాలను ఎవరూ పట్టించుకోరు అని కూడా చెబుతున్నారు. ఇకపై వచ్చే సినిమాలు కూడా చూడమని అభిప్రాయం ఏర్పడుతుంది. ఓ ట్రెండ్ గా మారిన సినిమాల చిత్రీకరణ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది అని చెప్పవచ్చు. బయోపిక్ లకు కాలం చెల్లిందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: