ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీ తో బిగ్ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. అలవైకుంఠపురములో మూవీ తో పాటు అందులోని సాంగ్స్ కూడా విశేషమైన ఆదరణ దక్కించుకుని ఆయనకు అంత భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి.

దానితో ప్రశుతం ఆయన నటిస్తున్న పుష్ప మూవీ పై అందరిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎంతో భారీ స్థాయిలో రెండు పార్ట్శ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో మైత్రి మూవీ మేకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఐదు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక సాంగ్ కూడా అందరినీ అలరించింది. ఇక ఈ సినిమా ని క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. నిజానికి ఇంచుమించు అదే సమయానికి భారీ పాన్ ఇండియా సినిమా కెజిఎఫ్ కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావించారట ఆ మూవీ మేకర్స్.

అయితే అప్పటికే పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి భారీ ఎత్తున రిలీజ్ కి ప్లాన్ చేసిన మేకర్స్, తమ మూవీ రిలీజ్ విషయాన్ని కెజిఎఫ్ టీమ్ కి చెప్పారట. అనంతరం తమ మూవీ విడుదల విషయమై కొంత ఆలోచన చేసిన కెజిఎఫ్, ఆపై మరికొన్నాళ్లు అనంతరం తమ మూవీ విడుదల చేయాలని ఫిక్స్ అయిందట. అయితే అంతకముందు పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరువాత కెజిఎఫ్ టీమ్ తో అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడిన అనంతరమే వారు ఫైనల్ గా వెనక్కి తగ్గారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తంగా దీనిని బట్టి తమ సినిమాని డిసెంబర్ లో సోలో రిలీజ్ చేసేలా అల్లు అర్జున్ సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: