మన టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ లో స్థానం సంపాదించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎలాగోలా అక్కడ జెండా పాతేయాలని తెగ ట్రై చేస్తున్నారు. చిన్న చిన్న అవకాశాలతోనే ముంబై ఫ్లేట్ ఎక్కేసి తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. పైగా బాలీవుడ్ లో అక్కడి హీరోలకు నెమ్మదిగా క్రేజ్ తగ్గిపోతోంది. సరైన కథలు రాకపోవడంతో వరుస ఫ్లాప్ లు వస్తున్నాయి. దీంతో మన తెలుగు హీరోలు పాన్ ఇండియన్ మార్కెట్‌ని ఫోకస్ చేస్తోంటే, తమిళ స్టార్లు తెలుగు మార్కెట్‌పై కన్నేస్తున్నారు. ఇప్పటికీ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించిన కోలీవుడ్‌ స్టార్స్, ఇప్పుడు స్ట్రయిట్‌ మూవీస్‌తో తెలుగులో జెండా పాతాలనుకుంటున్నారు.

కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్ కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్‌పై స్పెషల్‌ ఫోకస్ పెడుతున్నాడు. 'విజిల్, మాస్టర్' సినిమాలకి తెలుగునాట మంచి వసూళ్లు రావడంతో, రెట్టించిన ఉత్సాహంతో తెలుగు సినిమాలకి సైన్ చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక బైలింగ్వల్‌కి సైన్ చేశాడు విజయ్. ధనుష్ సినిమాలకి తమిళనాడులో ఎంత ఫాలోయింగ్‌ ఉందో, తెలుగులోనూ అదే క్రేజ్ ఉంది. యూనిక్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తాడనే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మల్టీలింగ్వల్ మూవీ చేస్తున్నాడు ధనుష్. అలాగే మరో మూడు సినిమాలకి సైన్ చేశాడనే టాక్ వస్తోంది.

సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానని చాన్నాళ్లుగా చెప్తున్నాడు. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమా మాత్రం చేయలేదు. కానీ ఇప్పుడు సీరియస్‌గా తెలుగు మేకర్స్‌ కోసం వెతుకుతున్నాడనే టాక్ వస్తోంది. అలాగే శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడని చెబుతున్నారు. మొత్తానికి తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీపై ఆసక్తి చూపిస్తున్నారు. అరకొర సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ కథనాయకులు ఇప్పుడు స్ట్రయిట్ సినిమాలతో ముందుకు వస్తున్నారు. మరి వీళ్లు తెలుగు మార్కెట్ ను ఎలా కొల్లగొడతారో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: