సినిమా రంగంలో అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్పుడు, క్రేజ్ ఉన్న‌ప్పుడే బెట్టు చేయాలి.. నాలుగు రాళ్లు వెన‌కేసు కోవాల‌న్న‌ది నిజం. ఈ సూత్రం హీరోయిన్లు బాగా వంట ప‌ట్టించుకుంటారు. హీరోల‌కు ఇండ‌స్ట్రీలో లాంగ్ లైఫ్ ఉంటుంది. వారు ఏకంగా 30 - 40 సంవ‌త్స‌రాల పాటు స్టార్ హీరోలుగా కొన‌సాగుతూ ఉంటారు. అయితే హీరోయిన్లు మ‌హా అయితే ఐదారు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఇండ‌స్ట్రీలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే అనుష్క‌, న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు మాత్ర‌మే ప‌దేళ్లో లేదా ప‌దిహేనేళ్లో ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొన‌సాగుతూ ఉంటారు. అయితే ఇలాంటి అవ‌కాశం చాలా త‌క్కువ మంది కి మాత్ర‌మే వ‌స్తుం టుంది.

ఇక హీరోయిన్లు ఒక్క హిట్ వ‌స్తే వాళ్లు ఆకాశంలోనే ఉంటారు.. కింద‌కు దిగ‌రు. వాళ్ల గొంతెమ్మ కోరిక‌లు మామూలుగా ఉండ‌వు. ఇక ఇటీవ‌లే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఓ యంగ్ హీరోయిన్ ఒక్క హిట్టు కొట్టిందో లేదో అప్పుడే ఇండ‌స్ట్రీకి చుక్క‌లు చూపిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చూడ‌డానికి మంచి రంగు.. రూపు ఉన్న ఈ హీరోయిన్ న‌ట‌న విష‌యంలో ఏ మంత యాక్టివ్ గా ఉండ‌ద‌న్న టాక్ కూడా ఉంది. ఈ విష‌యం ఆమె తొలి సినిమాలో న‌టించిన ప్పుడు ఎవ్వ‌రికి పెద్ద‌గా తెలియ‌ద‌ట‌.

అయితే ఇప్పుడు ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో ఆమె తో ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయంటున్నారు. ఈ హీరోయిన్ బాల‌న‌టిగా ముందు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించి.. వారి మ‌న‌స్సుల‌ను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఆమెకు వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వ‌స్తున్నాయి. దీంతో అమ్మ‌డు కొండెక్కేసింద‌ట‌. అయితే ఆమె ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను బాగా ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. ఆమె తాజా చిత్రం షూటింగ్ లో ఆ సినిమా ద‌ర్శ‌కుడికి చుక్క‌లు చూపిస్తోంద‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: