టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రేక్షకులను తన సినిమాలతో ఎంతగానో అలరిస్తాడు.  ఫలితం ఎలా ఉన్నా కూడా ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తాయి. అయితే చాలా సినిమాలు ఆయన కెరీర్ లో దారుణమైన ఫ్లాప్ సినిమాలుగా ఉన్నాయి. అయితే అవి ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరచలేదు. అలా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఫ్లాప్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆయన కెరీర్లో తెరకెక్కిన రెండవ సినిమా బాచి బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది ఇది. జగపతి బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఎన్టీఆర్ తో చేసిన ఆంధ్రావాలా చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన తమ్ముడు హీరోగా 143 అనే సినిమా చేయగా అది కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేసిన మొదటి సినిమా చిరుత కథాపరంగా పెద్ద గా అలరించలేకపోయినా రామ్ చరణ్ ను ఎలివేట్ చేయడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. 

ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు ఏక్ నిరంజన్ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తేలిపోయాయి. రవితేజ నటించిన నేనింతే, రానా తో చేసిన నేను నా రాక్షసి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం అయ్యాయి. ఇక రవితేజ తో చేసిన మరో సినిమా దేవుడు చేసిన మనుషులు అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలు నితిన్ చేసిన హార్ట్ ఎటాక్ సినిమా లు కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఇంకా జ్యోతిలక్ష్మి, లోఫర్, పైసా వసూల్, మెహబూబా సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: