
సంక్రాంతి కానుకగా తాను హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఎన్ని పెద్ద సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చినా కూడా ఆ సీజన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానా మరో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమైన భిమ్లా నాయక్ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్ కావడంతో ప్రేక్షకులు సినిమాలను చూడడానికి ఎంతో ఆసక్తి చూపించే సీజన్ కావడంతో ఈ సీజన్ లో తన సినిమాను విడుదల చేయాలని ఎప్పుడో విడుదల తేదీ ను అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్.
అయితే ఆయన అలా అనౌన్స్ చేసాడో లేదో ఇతర పెద్ద హీరోల సినిమాల అనౌన్స్ మెంట్లు కూడా వచ్చేశాయి. ప్రభాస్ రాధేశ్యామ్ అలాగే మహేష్ సర్కారు వారి పాట మరియు యు.ఎస్.రాజ మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలు అన్ని ఆయన సినిమా నీ చుట్టేశాయి. దాంతో పవన్ కళ్యాణ్ తన సినిమాను ఇన్ని పెద్ద సినిమాల మధ్య విడుదల చేస్తాడా అన్న అనుమానాలను పవన్ అభిమానులు వ్యక్తపరిచారు. ఇన్ని పెద్ద సినిమాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే కంటే సోలోగా మరొక తేదీని ఎంచుకోవడం మంచిది అని చాలామంది పవన్ అభిమానులు ఆయనకు సూచించారు.
కానీ పవన్ ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాటే ఆయన వినడ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతో సంతోషపరుస్తుంది. ఎంత గట్టి నమ్మకం లేకపోతే అన్ని పెద్ద సినిమాల మధ్య కూడా ఆయన సినిమాను విడుదల చేస్తాడు అని అంటున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నారు పవన్ అభిమానులు. నిత్యామీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా ఈ సినిమాలోని రెండో పాటను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలే మొదటి పాట విడుదల కాగా ఆ పాటకు విపరీతమైన స్పందన దక్కుతుంది.