రాజమౌళి పర్ ఫెక్షన్ ను ఎవ్వరూ తప్పు పట్టలేరు. అయితే అది భారీ బడ్జెట్ సినిమా.. ఇలా ఇష్టం వచ్చినట్టు తమకు తాము గా డేట్లు వేసుకుంటూ పోతుంటే.. మరి మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటన్న దే ఇప్పుడు రాజమౌళి అందరికి టార్గెట్ గా మారడానికి కారణమైంది. అర్రే ఎవ్వరితోనూ చర్చించరు. ప్రతి సారి రిలీజ్ చేస్తున్నామంటూ ఓ పోస్టర్ వేస్తున్నారు.. మేం కూడా ఇక్కడ కోట్లు పెట్టుకుని ఉన్నాం.. మా సంగతేంటి.. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ డేట్లు వేసుకుంటూ వెళతారా ? అని మిగిలిన పెద్ద సినిమాల నిర్మాతలు ఇప్పుడు రాజమౌళి తో పాటు ఆర్ ఆర్ ఆర్ టీం పై సీరియస్ గా ఉన్నారు.
సంక్రాంతికి ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు డేట్లు వేసుకుని ఉన్నాయి. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధే శ్యామ్. మరి ఇప్పుడు సడెన్‌గా జనవరి 7 అంటూ ఎవ్వరికి చెప్పకుండా డేట్ వేయడంతో పై మూడు సినిమాల నిర్మాతల కోసం నషాళానికి అంటేసిందట. పేరుకు మాత్రమే గిల్డ్ ఉన్నా.. దానిని ఎవ్వరూ ఖాతారు చేయడం లేదు. ఇప్పుడు భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటోందట. అయితే మళ్లీ ఆర్ ఆర్ ఆర్ డేట్ మారుతుందా ? మేం ఫిబ్రవరి 24న రావాలనుకుంటున్నాం.. ఆర్ ఆర్ ఆర్ తప్పుకుంటే మాకు సంక్రాంతి ఛాన్స్ మిస్ అయినట్టే కదా ? అని భీమ్లా సినిమా నిర్మాతలు ఉన్నారు. వీరంతా కూడా రాజమౌళి ఇష్టారాజ్యం పై గుర్రుగా ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి