బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బాలయ్య కొంత గ్యాప్ తరువాత డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను తీస్తుండగా మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన రెండు టీజర్స్, ఒక సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.

దీని తరువాత గోపీచంద్ మలినేని తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు బాలయ్య. కాగా త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే అటు సినిమాలతో ఇప్పటివరకు ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న బాలయ్య తొలిసారిగా త్వరలో ఆహా ఒటిటి ద్వారా ప్రేక్షకాభిమానులని మరింతగా అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆహా ఒటిటిలో అన్ స్టాపబుల్ పేరుతో ఎంతో క్రేజ్ తో సాగనున్న ఈ షో ఫస్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవల వైభవంగా జరుగగా నేడు కొద్దిసేపటి క్రితం దీని ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. అయితే అందరి నుండి భారీ స్థాయి ప్రశంసలు అందుకుంటూ ఈ ప్రోమో మంచి లైక్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది.

ముఖ్యంగా ఈ ప్రోమోలో బాలయ్య స్టైల్, డైలాగ్స్, యాక్షన్ అయితే ఎంతో అదిరిపోయింది, ఇక ప్రోమో చూసిన వారందరూ కూడా ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అంటూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా ప్రోమోలో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు బాలయ్య. బాలయ్య ఫస్ట్ టైం ఈ షో మా ఆహా వారితో చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ చెప్పారు. కాగా ఈ సూపర్ షో ని దీపావళి కానుకగా ఆహా వారు టెలికాస్ట్ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: