కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ పవర్ స్టార్ గా పేరుగాంచిన హీరో పునీత్ రాజ్ కుమార్ నిన్న గుండె పోటుతో మరణించారు. వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఛాతిలో నొప్పి వచ్చింది. దాంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికీ విషమించిన ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయనను వారు కాపాడుకోలేక పోయారు.

మేజర్ హార్ట్ ఎటాక్ రావడం వల్లనే ఆయనను బ్రతికించ లేకపోయామని హాస్పిటల్ యాజమాన్యం చెప్పారు. ఇక పునీత్ మరణాన్ని ప్రతి ఒక అభిమాని కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మరణం పట్ల సానుభూతి తెలిపారు. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడానికి కారణం ఏదైనా కూడా ఆయన లేని లోటు ను ఎవరు పూడ్చలేనిది అంటూ వారి సంఘీభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

టాలీవుడ్ లో కూడా పునీత్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క నటుడు ఆయన గురించి మాట్లాడుతూ తమ సానుభూతి వెళ్ల బరు స్తున్నారు. అయితే బ్రతికున్న సమయంలో పునీత్ టాలీవుడ్ తో ఎంతో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకొని తరచూ మన హీరోలందరితో కలిసి మెలిసి స్నేహంగా ఉండే వారు. ముఖ్యంగా నందమూరి మెగా ఫ్యామిలీ లతో ఆయన చాలా దగ్గరగా ఉండేవారు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలనేది తన చిరకాల కోరిక ఆయన అని ఆయన చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోవడం మెగా ఫ్యాన్స్ నీ ఎంతో నిరాశ కలిగిస్తుంది. మరి ఆయన కోరిక తీరే అవకాశం లేదు కాబట్టి ఆయన వారసులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కాని ఈ కోరిక తీర్చి ఆయన ఆత్మకు శాంతి కలుగజేయాలి. చిరంజీవి కూడా అయన మృతి పట్ల సానుభూతి తెలిపిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: