ప్రస్తుతం ఓటిటి ల వాడకం ఎంత పెరిగిందో  మన అందరికీ తెలిసిందే, కొన్ని సంవత్సరాల క్రితం వరకు థియేటర్ లలో సినిమా విడుదల అయిన తర్వాత దాదాపు 50 రోజులు గడిచే దాకా ఓటిటి లో సినిమాలు వచ్చేవి కావు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఒక వేళ సినిమా హిట్ టాక్ బాక్సాఫీస్  దగ్గర మంచి కలెక్షన్లు తెచ్చుకుంటే తప్ప,  మామూలు టాక్ ను సంపాదించుకున్న సినిమాలు నెల తిరిగే లోపే ఓటిటి లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.  అయితే తాజా గా ఈ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది, సంతోష్ శోభన్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి.  దర్శకుడు మారుతి గోపీచంద్ హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ సినిమాను ప్రారంభించి మధ్య లో కాస్త గ్యాప్ దొరకడంతో ఈ దర్శకుడు ఆ గ్యాప్ లో మంచి రోజులు వచ్చాయి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేశాడు.

 ఇలా అతి తక్కువ కాలంలో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన మారుతి ఈ సినిమాను నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశాడు, ఈ సినిమా థియేటర్ ల వద్ద ఆశించిన రీతిలో ఫలితాన్ని తెచ్చుకోలేకపోయింది. యువి క్రియేషన్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది, థియేటర్ లలో జనాలను పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా ఓటిటి లో ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు,  ఏక్ మినీ కథ  సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు, మంచి రోజులు వచ్చాయి సంతోష్ శోభన్ కు మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: