టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ బాగా తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది..

ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప' కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయట.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయని తెలుస్తుంది..

కాగా ఈ సినిమా నుండి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారని సమాచారం.. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు గతకొద్ది రోజులుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ వస్తోందట.అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్లో ఎవరు చిందులేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా ఈ సాంగ్‌లో స్టార్ బ్యూటీ సమంత ఐటెం గర్ల్‌గా మారుతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారని తెలుస్తుంది

'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో సామ్‌ను వెనుక నుండి చూపించారని తెలుస్తుంది.. ఈ పాటను అతి త్వరలో రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిందట.ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో కనిపిస్తుండగా, ఇప్పుడు సమంత లాంటి స్టార్ బ్యూటీ ఐటెం పాపగా మారుతుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి మాస్ మసాలా సాంగ్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం అందరికి తెలిసిందే., ఈ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: