ఒమైక్రాన్ వార్తలు ఊపు అందుకోవడంతో మళ్ళీ చాల సినిమాలు ఓటీటీ కి వెళ్ళిపోతాయి అంటూ ప్రచారం సాగుతోంది. ఈ లిస్టులో సంక్రాంతికి రిలీజ్ కు కావలసి ఉన్న ‘భీమ్లా నాయక్’ ముందు వరసలో ఉంది అంటూ ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఈ మూవీకి ఇప్పటికే కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ మూవీ నిర్మాతలు ఆ ఫర్లను కాదనుకుని సంక్రాంతి రిలీజ్ వైపు అడుగులు వేస్తోంది.


అయితే ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉంటే తమకు నష్టమని దిల్ రాజ్ అదేవిధంగా రాజమౌళి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు సంక్రాంతి రిలీజ్ వైపే పట్టుపడుతున్నట్లు టాక్. లేటెస్ట్ గా ఒమైక్రాన్ హడావిడి మొదలు కావడంతో ఈ మూవీ నిర్మాతలు ఈనెల 17న విడుదల కాబోతున్న ‘పుష్ప’ మూవీ పరిస్థితి బేరీజ్ వేసుకున్న తరువాత తమ మూవీ సంక్రాంతి రేస్ లో ఉండాలా లేదంటే ఓటీటీ కి ఇచ్చేయాలా అన్న విషయమై ఒక తుది నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.


అయితే ఈ సినిమాకు 100 కోట్లకు పైగా ఖర్చు అవ్వడంతో ఆ రేంజ్ లో ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తాయా అన్న సందేహం ఈ మూవీ నిర్మాతలకు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులు చూస్తారు కానీ మిగతా భాషల ఓటీటీ ప్రేక్షకులు పవన్ సినిమా పై పెద్దగా ఆశక్తి చూపించరని అనేక ఓటీటీ సంస్థల అభిప్రాయం అని అంటున్నారు.


దీనికితోడు ఈమూవీని ఓటీటీ లో విడుదల చేస్తే పవన్ అభిమానుల నుంచి నిరసన ఎక్కువగా ఉంటుందని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కారణం వలన అనుకోకుండా ఈ కొత్త వైరస్ ప్రభావం వల్ల సంక్రాంతి సినిమాలు వాయిదా పడితే ఈమూవీ నిర్మాతలకు వందల కొట్లల్లో నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు..  
మరింత సమాచారం తెలుసుకోండి: