హీరో బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడం జరిగింది. ఇక అలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను కూడా తెరకెక్కించారు. బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ కొన్ని ఉన్నాయి.. అందులో కొన్ని కథలు నచ్చక చేయలేదు.. మరికొన్ని మాత్రం తన డేట్స్ ఖాళీగా లేక వదిలేశారు. అలా వదులుకున్న సినిమాలను ఇప్పుడు మనం చూద్దాం.

1). బజారు రౌడీ:
సినిమా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి బాలకృష్ణతో తీయాలనుకున్నారు. కానీ బాలకృష్ణ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో.. కృష్ణ కుమారుడు రమేష్ బాబు తో చేయవలసి వచ్చింది.

2). చంటి:
తమిళంలో చిన్న తంబి అనే సినిమా ఇది. ఈ కథను బాలకృష్ణకు తెలుపగా.. కథ నచ్చకపోవడంతో వదిలేశారు. కానీ ఈ సినిమాని రాజేంద్రప్రసాద్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ చివరికి వెంకటేష్ నటించాడు.

3). సూర్యవంశం:
మూవీ నిర్మాత బాలకృష్ణ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ మూవీ పెద్దన్నయ్య స్టోరీకి దగ్గర పోలికలు ఉండడం తో బాలకృష్ణ వదిలేశారు.

4). సీతయ్య:
సినిమా స్టొరీ ని బాలకృష్ణనే  హీరోగా ఊహించుకొని డైరెక్టర్ వై.వి.యస్.చౌదరి ఈ సినిమా కథను రాసుకున్నాడట. బాలకృష్ణ కూడా ఈ సినిమా స్టోరీ బాగా నచ్చింది. కానీ అప్పటికే బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ మూవీని వదిలేసారు. దాంతో ఈ సినిమాని హరికృష్ణ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

5). సింహాద్రి:
మూవీ కథను కూడా బాలకృష్ణ ను దృష్టిలో పెట్టుకొని విజయేంద్రప్రసాద్ రాశారట. కానీ కదా నచ్చక పోవడంతో బాలకృష్ణ రిజెక్ట్ చేశారు దీంతో ఈ స్టోరీని ఎన్టీఆర్ తో తెరకెక్కించి సక్సెస్ అందు కున్నారు.

6). వకీల్ సాబ్:
దిల్ రాజు ఈ సినిమాని ముందుగా బాలకృష్ణతో చేయాలని అనుకు న్నారట.ఏమైందో తెలియదు కానీ.. బాలయ్య బదులు పవన్ కళ్యాణ్ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: