అంతేకాదండోయ్ ఎన్నో ఐటమ్ సాంగ్స్ లో కూడా హాట్ హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ పగటి కల ల్లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన శ్రియ శరన్. గమనం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత శ్రియ శరణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా యువ హీరో శర్వానంద్ వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీయ పై ప్రశంసలు కురిపించాడు. హీరోయిన్ శ్రియ సంతోషం సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. గమనం కథను నాకు డైరెక్టర్ జ్ఞానశేఖర్ ఇంతకుముందే వినిపించాడు అంటూ తెలిపాడు శర్వానంద్. అయితే ఈ సినిమా స్టొరీ చాలా నచ్చిందని కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో నటించలేక పోయాను అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.. ఇక ఇప్పుడు ఈ సినిమాలో భాగస్వామి కావాలని అనిపిస్తోంది అంటూ తెలిపాడు. కాగా డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.