అయితే ఈసారి బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ప్రేమ పావురాలు ఎక్కడా కనిపించలేదు. ఎవరి మధ్య ప్రేమ చిగురించడం లేదు. కానీ మొదట్లో తామిద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న యూట్యూబర్లు షణ్ముఖ సిరి మాత్రం ఆ తర్వాత ఏకంగా హగ్గులు కిస్సులతో రెచ్చిపోవడం మాత్రం బుల్లితెర ప్రేక్షకులందరికీ కాస్త చిరాకు తెప్పించింది అని చెప్పాలి. ఒకవేళ వీరిద్దరూ సింగిల్ అయి ఉంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అనుకునేవారు బుల్లితెర ప్రేక్షకులు. కానీ ఇప్పటికే సిరి కి శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైన తో లవ్ లో కొనసాగుతున్నాడు.
దీంతో మేము మంచి స్నేహితులం అని చెప్పుకుంటూనే హగ్గులు కిస్సులు తో రెచ్చిపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక పలుమార్లు వీరి ఫ్రెండ్షిప్ వివాదంగా కూడా మారింది. అయితే ఇటీవలే సిరి షణ్ముక్ లకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరి స్నేహితుడు జెస్సి ప్రశ్నలతో కడిగేశాడు. ఇటీవల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కు హౌస్ లో ఉన్న వారిని ప్రశ్నించేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఎలిమినేట్ అయిన జెస్సి మాట్లాడుతూ షణ్ను ఇది చాలా సీరియస్.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? ఒక్కసారైనా ఆలోచించావా అంటూ సూటిగా అడిగాడు జెస్సీ. అలాగే సిరికి గట్టిగానే క్లాస్ పీకాడు జెస్సి. 'నువ్వు బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు.. కానీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను అదీ ఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు ఎందుకు, ఇవన్నీ అవసరమా నీకు' అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు జెస్సీ. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించని హౌస్‌మేట్స్ ఈ ప్రశ్నలకు ఏమని సమాధానాలిచ్చారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి