
అసలు బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోగలడా అని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న టాప్ యాంకర్ ల కంటే అద్భుతంగా షో హోస్టింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అయితే బాలకృష్ణ unstoppable 5 వ ఎపిసోడ్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఏకంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ముందుగా డైరెక్టర్ రాజమౌళి unstoppable స్టేజి మీదికి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రాజమౌళి ని ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.
ఈ క్రమంలోనే మన ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా పడలేదు. మా అభిమానులు బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగారు. మరి మనిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అంటావా రాజమౌళి చెప్పు అంటూ బాలకృష్ణ ప్రశ్నించాడు.. అయితే బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజమౌళి ఏకంగా మీసాలు తిప్పాడు. దీంతో సమాధానం చెప్పకుండా ఇలా మీసాలు తిప్పుతున్నాడు ఏంటి అంటూ రాజమౌళి ని చూసి బాలకృష్ణ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు సమాధానం పూర్తి ఎపిసోడ్ లో రివీజ్ చేయబోతున్నారు. దీంతో జక్కన్న బాలయ్యతో సినిమా గురించి రాజమౌళి ఏం చెప్తాడు అన్నది అనేది హాట్ టాపిక్ గా మారింది.