ఇక ప్రస్తుతం అమ్మడు ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లోను వరుస సినిమాలతో బిజీ గా ఉంది. అయితే, సినిమా ల పరంగా ఎప్పుడు హాట్ టాపిక్ అవ్వని రష్మిక .. తన పరసనల్ లైఫ్ విషయలల్లో మాత్రం నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక బాండింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్ లోనే ఉంటాయి. గీతాగోవిందం సినిమాలో జంటగా నటించిన ఈ జంట అంటే అభిమానుల్లో పిచ్చ క్రేజ్ ఉంది.
ఇక దానికి తగ్గట్లే ఈ జంట కూడా కలిసి బయటకు వెళ్ళడం..వెళ్లిన ప్రతిసారి మీడియా కంట పడడం..దొరికిన ప్రతిసారి మేం జస్ట్ ఫ్రెండ్స్ అనడం కామన్ అయిపోయింది. ఇక రీసెంట్ గా రష్మిక , విజయ్ మరోసారి మీడియా కంట పడ్డారు. ముంబైలో ని బాంద్రాలోని రెస్టారెంట్‌లో రాత్రి డిన్నర్ డేట్ కు వెళ్లారు రష్మిక,విజయ్. ఇక అక్కడే ఉన్న మీడియా కంట పడ్డింది ఈ క్యూట్ కపుల్. ఇక్కడ డౌట్లు వచ్చే విషయం ఏమిటంటే..రెస్టారెంట్ లో నుండి ముందు విజయ్ వచ్చి కార్ ఎక్కారు..ఆ తరువాత రష్మిక కొంచెం సేపటికి వచ్చి విజయ్ కార్ లోనే ఎక్కింది. దీంతో వీళ్ల మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమ్మురేపుతుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి