స్టార్ హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఊ అంటావా ఊహూ అంటావా పాటకు సమంత అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారట..

పుష్ప ద్వారా రష్మిక కంటే సమంతకు ఎక్కువగా ప్రశంసలు దక్కాయని తెలుస్తుంది.అయితే పుష్ప సినిమా ప్రమోషన్స్ లో మాత్రం సమంత కనిపించడం లేదట.పుష్ప సినిమా సాంగ్ కోసం సామ్ ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయట.

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే విషయంలో సమంత ముందువరసలో ఉంటారట.. అయితే పుష్ప ప్రమోషన్స్ కు సమంత దూరంగా ఉండటానికి ముఖ్యమైన కారణమే ఉందని సమాచారం.. సమంత ప్రస్తుతం కొచ్చిలో ఉన్నారని ఆ కారణం వల్లే పుష్ప ప్రమోషన్స్ కు హాజరు కావడం లేదని తెలుస్తుంది.. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం పుష్పను సమంత ప్రమోట్ చేస్తున్నారట.మరోవైపు సమంత స్పెషల్ సాంగ్ చేయడం గురించి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట..

 

భవిష్యత్తులో సమంత మరిన్ని స్పెషల్ సాంగ్స్ చేస్తారేమో చూడాల్సి ఉందట. సమంత ప్రధాన పాత్రలో రెండు సినిమాలు తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఆ సినిమాలు రిలీజ్ కానున్నాయట.. సమంత ఇప్పటికే నటించిన శాకుంతలం రిలీజ్ డేట్ ప్రకటన వెలువడాల్సి ఉందట.సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారట.

 

హాలీవుడ్ ప్రాజెక్ట్ లకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే సమంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట.. రోజురోజుకు సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తుంది.. ఒక్కో సినిమాకు సమంత 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. సమంతకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా సామ్ కు భారీస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: