'ఆర్ ఆర్ ఆర్' విడుదలతో మొదలై.. సినిమాల పండగ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తుందని, 2022 ఫిల్మ్‌ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్‌ ఇయర్‌గా నిలుస్తుందని ట్రేడ్‌ పండిట్స్‌ అంతా లెక్కలేశారు. రాజమౌళి అండ్ టీమ్ కూడా భారీగా వసూలు చేయాలని.. ఒక రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, ముంబాయి ఇలా సిటీస్‌ అన్ని చుట్టేసింది. కానీ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతోన్న సమయంలో ఒమిక్రాన్‌ ప్రభావమూ మొదలైంది.

ప్రభాస్‌ ఆరేళ్లుగా 'బాహుబలి-1, బాహుబలి-2, సాహో' అంటూ వరుసగా యాక్షన్‌ మూవీస్‌లోనే ఉండిపోయాడు. అయితే వారియర్, లేకపోతే యాక్షన్‌ లుక్‌నే కంటిన్యూ చేశాడు. ఇంత గ్యాప్‌ తర్వాత 'రాధేశ్యామ్' సినిమాతో మళ్లీ రొమాంటిక్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. రాధాక్రిష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్‌స్టోరీ ఒక పెయింటింగ్‌లా ఉంటుందనే కామెంట్స్‌ వచ్చాయి. ఒమిక్రాన్‌ ప్రభావం పెరుగుతోందని, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూలు పెట్టాయి. థియేటర్లలో ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధనలు పెట్టాయి. దీంతో సంక్రాంతి బరి నుంచి భారీ సినిమాలు 'ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్' రెండూ తప్పుకున్నాయి. ఎవరైనా సరే ఈ ఏడాది నష్టమొస్తే, వచ్చే ఏడాది జాగ్రత్తపడదామనే ఆశతో ఉంటారు. కానీ రెండేళ్లుగా ఇండస్ట్రీలో ఈ నమ్మకం కూడా తగ్గిపోతోంది. ఇంటర్వెలే తప్ప క్లైమాక్సే లేదన్నట్లు సాగుతోన్న కరోనా వేవ్స్‌తో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. షూటింగులు ఆగిపోయి, రిలీజుల్లేక ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ భారీగా నష్టపోతోంది.

అజిత్‌ 'వలీమై' మాత్రం సంక్రాంతి బరిలో దిగడానికి చాలా ట్రై చేసింది. తెలుగు, తమిళ్, హిందీల్లో జనవరి 13న రిలీజ్‌ అని అనౌన్స్ చేసింది. అయితే అజిత్‌కి మెయిన్‌ మార్కెట్ అయిన తమిళనాట ఒమిక్రాన్‌ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. నైట్‌ కర్ఫ్యూలు, ఆదివారాలు లాక్‌డౌన్లు విధించారు. మూడు ఆటలు, 50 పర్సంట్‌ ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడింది.

ఢిల్లీలో ఒమిక్రాన్‌ ప్రభావం మొదలవగానే షాహిద్‌ కపూర్ 'జెర్సీ' సినిమా పోస్ట్‌పోన్ అని ప్రకటించింది. ఆడియన్స్ వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి బయ్యర్లని నష్టాల్లోకి నెట్టడం కంటే, సినిమాని వాయిదా వేయడం బెటర్‌ అని 'జెర్సీ'ని హార్డ్‌ డిస్కుల్లోనే పెట్టేశారు నిర్మాతలు. అక్షయ్‌ కుమార్ హిస్టారికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చేసిన 'పృథ్వీరాజ్' సినిమా కూడా వాయిదా పడుతోంది. ఈ మూవీని జనవరి లాస్ట్‌వీక్‌లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు నిర్మాతలు. కానీ ఒమిక్రాన్‌ టెన్షన్‌తో 'పృథ్వీరాజ్'ని కూడా వాయిదా వేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌లతో రూపొందిన ఈ సినిమాలు వాయిదా పడటంతో ఇండస్ట్రీలో దాదాపుగా 2000 కోట్ల బిజినెస్‌ ఆగిపోయిందని చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: