తమన్నకి స్టార్ హీరోస్‌ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి. థర్టీ ప్లస్‌లో ఉందని, కుర్ర హీరోలు మిల్కీని పక్కన పెడుతున్నారు. దీంతో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది తమన్న. చిరంజీవితో 'భోళాశంకర్', వెంకటేశ్‌తో 'ఎఫ్3' సినిమాలు చేస్తోంది. అయితే జర్నీ బిజీగా ఉండడానికి సీనియర్ల సినిమాలతో పాటు ఐటెమ్‌ సాంగ్స్‌ కూడా చేస్తోంది. 'అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేసిన తమన్న ఇప్పుడు వరుణ్‌ తేజ్ 'గని'లో కొడితే అనే స్పెషల్‌ సాంగ్ చేస్తోంది.

రెజీనాకి తెలుగులో 'జ్యో అచ్యుతానంద' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. డిజాస్టర్స్‌తో రెజీనా జర్నీకి బ్రేకులు పడ్డాయి. మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైమ్‌లో 'ఎవరు' సినిమాలో నెగటివ్‌ రోల్‌ కూడా ప్లే చేసింది. విశాల్‌ 'చక్ర' సినిమాలో కూడా విలన్‌గా చేసింది. అయినా హీరోయిన్‌ రోల్స్‌ రావడం లేదు. తెలుగు ఆడియన్స్‌ అంతా మర్చిపోతోన్న టైమ్‌లో 'ఆచార్య'లో సానా కష్టం అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది రెజీనా. సమంత పెళ్లి తర్వాత కమర్షియల్‌ మూవీస్ తగ్గించింది. లేట్‌ అయినా సరే స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ కావాలని లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కే ఎక్కువగా సైన్ చేస్తోంది.  అయితే విడాకుల తర్వాత మళ్లీ బిజీ కావాలని స్పీడ్ పెంచింది సమంత. తెలుగు, తమిళ్లో వరుస సినిమాలకి కమిట్ అవుతోంది. వీటితోపాటు 'పుష్ప'లో ఊ అంటావా అని మాస్‌ ఐటమ్‌కి స్టెప్పులేసింది. ఈ సాంగ్‌తో కమర్షియల్‌ మూవీస్‌కి రెడీ అనే సిగ్నల్‌ ఇచ్చింది సామ్.

'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ హిట్‌ కొట్టింది ఫరియా అబ్దుల్లా. క్యూట్‌ యాక్టింగ్‌తో రోబో చిట్టి కంటే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. బాలీవుడ్‌ నుంచి ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం జరిగింది. అయితే కెరీర్‌ బిగినింగ్‌లోనే ఫరియా స్పెషల్‌ సాంగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది. 'బంగార్రాజు' సినిమాలో వాసివాడి తస్సాదియ్యా అంటూ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది ఫరియా. పూజా హెగ్డే తెలుగుతో పాటు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తూ బీటౌన్‌ స్టార్ హీరోయిన్‌గా మారుతోంది. ఇక ఈ బ్యూటీ కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. 'రంగస్థలం'లో జిగేలురాణిగా మాస్‌ స్టెప్పులేసింది. ఇక ఈ సాంగ్‌కి పూజా 50 లక్షలు తీసుకుందని చెప్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: