టాలీవుడ్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళల సమస్యలపై ఎల్లప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో మహిళల పట్ల జరిగే దాడులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తుంది. అంతే కాదు ఎంతో మంది మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మానసిక సంఘర్షణను సోషల్ మీడియాలో చిన్మయి తో పంచు కుంటూ ఆమె సలహాలను కూడా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మరోసారి తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. 

తాజాగా మలయాళ ప్రముఖ హీరోయిన్ పార్వతి తిరువోరు కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017 లో హీరోయిన్ ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అనేక మంది హీరోయిన్లు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. వారిలో ఈ మలయాళ నటి కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి అనేక మంది మహిళలతో కలిసి పోరాటం చేసింది. అలా పోరాటం చేస్తున్న సమయంలో తాను అవకాశాలు, ఉపాధి కోల్పోయాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినా.. తనకు అవకాశాలు రాలేదని.. 

అలాగే పోరాటం చేసినందుకు తనను బెదిరించారని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ విషయంపై సింగర్ చిన్మయి స్పందించింది." నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వాళ్ల తరఫున మాట్లాడడం వల్ల మాత్రమే ఆమె పని కోల్పోయిందని చెప్పడం నిజం. సమాజంలో చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే ఈ సమాజం ప్రేమిస్తుంది" అంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: