పూనమ్ కౌర్ అస్సలు ఎప్పుడు ఏమి చేస్తుందో.. ఎవరి మీద సెటైర్ వేస్తుందో చెప్పడం చాలా కష్టమే.ఆమె అస్సలు ట్వీట్లు ఎందుకు వేస్తుందో.. మళ్లీ ఎందుకు డిలీట్ చేస్తుందో కూడా ఆమెకే తెలియాలి. అయితే పూనమ్ కౌర్ వేసే ట్వీట్లలోనూ ఆంతర్యం అంతగా ఎవ్వరికీ కూడా అర్థం కాదు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్లు వేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇంకొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసినట్టుగా మనకి అనిపిస్తుంది.
అయితే చాలా వాటిల్లో పవన్ కళ్యాణ్ గురించిన రిఫరెన్స్‌లు కూడా కనిపిస్తుంటాయి. కానీ ఏనాడూ కూడా పూనమ్ కౌర్ ప్రత్యక్షంగా ఆయనపై ట్వీట్లు వేయలేదు. కామెంట్ కూడా చేయలేదు. రెండు బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ వాడిన మాటలను అలాగే ట్వీట్లలో కూడా మెన్షన్ చేస్తుంటుంది. గురూజీ అంటూ కౌంటర్లు కూడా వేస్తుంటుంది. ఇక పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో లైక్ చేసే వీడియోలు కూడా అందరినీ బాగా ఆశ్చర్యపరుస్తుంటాయి.

దళపతి విజయ్ అభిమానులు పవన్ కళ్యాణ్‌ను ట్రోల్ చేసిన వీడియోను ఇప్పుడు పూనమ్ కౌర్ లైక్ చేసింది. వేరే వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా తనకే ఇస్తున్నారేమోనని భ్రమపడ్డాడట పవన్ కళ్యాణ్. అలా జరిగిన రెండ సందర్భాలను కలిపి ఆ వీడియోను ఎడిట్ చేశారు.
ఆ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ మీద రోజా చేసిన కామెంట్లు కూడా సంచలనానికి దారి తీశాయి. పరిటాల రవి ఇష్యూని తీసి రోజా సెన్సేషనల్ కామెంట్లు చేసిందట.ఆ వీడియోకి కూడా పూనమ్ కౌర్ లైక్ చేసింది. అయితే తాజాగా దళపతి విజయ్ అభిమానులు పవన్ కళ్యాణ్‌ను ట్రోల్ చేసిన వీడియోను పూనమ్ కౌర్ లైక్ చేసిందని సమాచారం.

పలు ఈవెంట్లలో భాగంగా పవన్ కళ్యాణ్ అందులో పాల్గొన్నాడట.వేరే వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. తనకే ఇస్తున్నారేమోనని భ్రమపడ్డాడట పవన్ కళ్యాణ్. అలా జరిగిన రెండ సందర్భాలను కలిపి ఈ వీడియోను వారు ఎడిట్ చేశారు. ఆ వీడియోను పూనమ్ కౌర్ లైక్ కొట్టే సరికి ఆమెపై పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ మండిపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: