సౌత్ ఆడియెన్స్ ని తన థైస్ షోతో ఆకట్టుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఓ పక్క సినిమాలు చేస్తూనే తన సోషల్ మీడియాని హీటెక్కించడం అమ్మడికి ఒక అలవాటుగా మారింది. టూ పీస్ బికినీతో పూజా బేబీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన మాల్దీవ్స్ ట్రిప్ తాలూఖా జ్ఞపకాలను నెమరేసుకుంటూ లేటెస్ట్ గా అక్కడ దిగిన మరో బికిని పిక్ ని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది పూజా హెగ్దే. తన గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలని క్లీన్ బౌల్డ్ చేయడమే అమ్మడు పనిగా పెట్టుకుందని అర్ధమవుతుంది.

పిచ్చెక్కించే అందాలతో పూజా హెగ్దే చేస్తున్న ఈ హంగామా ఆమెకి రోజు రోజుకి క్రేజ్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. అందాలను ప్రదర్శించడంలో అమ్మడు ఎన్ని డిగ్రీలు తీసుకుందో ఏమో కానీ ఆమె చేస్తున్న ఈ షోకి ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినిమాల్లో రెచ్చిపోతూనే బ్యాలన్స్ అందాలను ఇలా సోషల్ మీడియాలో గుమ్మరించేయడం ఆమెకు అలవాటుగా మారింది. స్కిన్ షోలో ఏమాత్రం అడ్డు గోడలు లేని ఈ అమ్మడు తన ఫాలోవర్స్ ని సంతృప్తి పరచడమే తన ముఖ్య ఉద్దేశం అనేలా ఉంది.

ఇక అమ్మడి సినిమాల పరిస్థితికి వస్తే ప్రభాస్ రాధే శ్యాం లో ప్రేరణగా మరోసారి మనసులు గెలిచేలా ఉంది. ఆ సినిమా రిలీజ్ కోసం తెలుగు ఆడియెన్స్ తో పాటుగా నేషనల్ ఆడియెన్స్ ఈగర్ గా ఉన్నారు. మరోపక్క కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజీ మూవీ బీస్ట్ లో కూడా పూజా హెగ్దే నటిస్తుంది. ఈ రెండిటితో పాటుగా బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో కూడా సర్కస్ అనే మరో క్రేజీ మూవీ కూడా చేస్తుందని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలతో మళ్లే నేషనల్ వైడ్ గా పూజా రచ్చ కన్ఫర్మ్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: