తమన్నా భాటియా 100% తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న నటి. ఈ అందాల నటి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలకు పైనే అవుతోంది. అయినా ఈ అమ్మడు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈమె స్క్రీన్ పై కనిపిస్తే రచ్చ రచ్చే. ఈమె వయసు ఇపుడు 32 ఏళ్లు అయినా తరగని అందంతో చెరగని గ్లామర్ తో ఈ అమ్మడి స్పీడ్ మామూలుగా లేదు. ముంబైలో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ను కంప్లీట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఒక కుదుపు కుదిపేసిన తమన్నా మొదట మోడలింగ్ తోనే తన కెరియర్ ను ఆరంభించింది. అప్పట్లో కాజల్ తనకు పరిచయమయ్యి ఇద్దరు స్నేహితులుగా మారారు.

ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మోడల్ గా ఉన్న సమయంలో తమన్నా పలు యాడ్స్ లో చేసింది. సన్ డైరెక్ట్, సెల్కాన్ మొబైల్స్, ఫాంటా, చంద్ర ఆయుష్ సోప్ వంటి పలు యాడ్స్ లో చేసింది తమన్నా. తెలుగులో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ మిల్కీ బ్యూటీ మొదట బాలీవుడ్ చిత్రం ( చాంద్ సా రోషన్  కెహ్రా 2005)  లో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తరవాత రెండేళ్లకు 2007 లో తెలుగులో 'హ్యపిడేస్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా కోసం దాదాపు 12 లక్షల వరకు రెమ్యునరేషన్  తీసుకున్నారు.

ప్రస్తుతం రెండున్నర కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నప్పటికీ తమన్నా మాత్రం ముంబై లోనే సెటిల్ అయ్యారు. అక్కడ ఉంటున్న ఆమె ఇల్లు ఖరీదు ఏకంగా 80 లక్షల పైనే ఉంటుంది. మహేష్ బాబు మరియు హృతిక్ రోషన్ కి తమన్నా పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీ గా ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో ఒక కీలక పాత్రకు సైన్ చేసినట్లు వార్త తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: