తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన పలువురు ఫిమేల్ యాంకర్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. సుమ, అనసూయ, రష్మీ వంటి యాంకర్లు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె సీనియర్ యాంకర్ గాయత్రి భార్గవి కూడా తన రూటు మార్చాలని ఓ నిర్ణయం తీసుకుందట. హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది గాయత్రీ భార్గవి. అందుకే ఆమెకు అనసూయ రేంజిలో ఛాన్సులు రాలేదని టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గట్టు కాస్త బోల్డ్ క్యారెక్టర్ కూడా చేయాలని ఈ సీనియర్ యాంకర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తాను మంచి గ్లామర్ బ్యూటీ అని.. అలాగే మంచి నటిని కూడా అని.. అయినా కూడా తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అని గాయత్రి బాగా ఫీల్ అవుతుందట.

నిజానికి గాయత్రి భార్గవికి హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. ఇంకా చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం అవుతోంది. అందుకే ఈమె ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉందట. నిజానికి గాయత్రి భార్గవి ఎప్పటినుంచో ఇండ్రస్టీ లో ఉన్నప్పటికీ మొదట్లో ఆమెకు సినిమాల్లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించినా అవి పెద్దగా ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అందుకే ఇక నుంచి అయినా తను సినిమాల్లో బిజీ అవ్వాలని తెగ ఆరాటపడుతోంది. పైగా తనకు అవకాశాలు ఇవ్వమని అడుగుతూ 'నేను అనసూయ కంటే బాగుంటాను కదా.. ఆమె కోసం రాసిన పాత్ర నాకు ఇవ్వండి. నేను చేస్తాను' అంటూ రిక్వెస్ట్ కూడా చేస్తుందట. నిజం చెప్పాలంటే ఆమె కంటే టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ పొజిషన్ కి వెళ్తుంటే..

ఆమె మాత్రం ఇంకా అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా అవకాశాల కోసం వెతుక్కునే క్రమంలో గాయత్రి భార్గవికి ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో ఓ వేశ్య పాత్ర కూడా ఉందట. మొదట ఈ పాత్ర కోసం అనసూయను తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఈ పాత్ర గురించి తెలుసుకున్న గాయత్రి భార్గవి ఆ పాత్రను నేను చేస్తాను అంటూ త్రివిక్రమ్ ను అప్రోచ్ అయిందట. అంతే కాదు త్రివిక్రమ్ కూడా ఆమెకు ఆ రోల్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఫిలిం సర్కిల్ లో మాత్రం ఈ వార్త జోరుగా వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: