బడా హీరోల బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. కొంతమంది హీరో హీరోయిన్లు రాణించలేకపోతూ ఉంటారు ఇండస్ట్రీలలో  ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితే ఒక బడా కుటుంబానికి చెందిన అల్లుడికి ఏర్పడింది.. అతను ఎవరో కాదు 2018 వ సంవత్సరం లో విజేత సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్.. కానీ ఆ సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు.. అలా చాలా కాలం గడిచిన తరువాత తాజాగా ఈ ఏడాది జనవరి నెలలో సూపర్ మచ్చి అనే సినిమాతో మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చారు.. కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది.. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వాసు దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికగా రచితారామ్  నటించింది.. ఇక ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేదు. ఇక పెద్దగా సినిమా ప్రమోషన్లు కూడా నిర్వహించలేదు..


ఇక మెగా హీరోలు కూడా ఈ సినిమా నుంచి కనీసం ఒక ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేయలేదు.. దీంతో ప్రజలు ఈ సినిమా విడుదలైంది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇక కలెక్షన్లు కూడా చాలా ఘోరంగా నమోదయ్యాయి.. విడుదలైన వారానికే ఈ సినిమా థియేటర్లలో మూతపడింది.. ప్రస్తుతం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఒకసారి చూస్తే..

1). నైజాం-15 లక్షలు
2). సీడెడ్-7 లక్షలు
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..7 లక్షల రూపాయలు.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ విషయానికొస్తే..-31 లక్షలు.
5). రెస్టాఫ్ ఇండియా యా-1 లక్ష.
6). ఓవర్సీస్-1 లక్ష.
7). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..22 లక్షలు సాధించింది.

ఇక ఈ సినిమాని ఎక్కువశాతం నిర్మాతలే డైరెక్టుగా విడుదల చేస్తున్నారు.. కానీ ఈ సినిమా సక్సెస్ కావాలంటే..1.45 కోట్లు రాబట్టాలి కానీ ఈ సినిమా ముగిసేసరికి..33 లక్షల మాత్రమే రాబట్టింది. దీంతో వారికి కోటి రూపాయలకు పైగానే లాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరొక చిత్రం కిన్నెరసాని లో నటిస్తున్నాడు.. ఇదైనా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: