నువ్వే నువ్వే సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు. అనంతరం మహేష్ తో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి వంటి సూపర్ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్ అక్కడి నుండి వరుసగా పలువురు స్టార్స్ తో సినిమాలు తీసే ఛాన్స్ అందుకున్నారు. ఇక మధ్యలో చిన్న హీరో నితిన్ తో అఆ వంటి సినిమా తీసి దానితో కూడా హిట్ కొట్టిన త్రివిక్రమ్, ఇటీవల అల్లు అర్జున్ తో తీసిన అలవైకుంఠపురములో మూవీతో కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్ అయితే మరింతగా పాపులర్ అయి యావత్ యూనిట్ మొత్తానికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాకి కూడా థమన్ సంగీతాన్ని అందించనుండగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే దీని తరువాత మరొక్కసారి అల్లు అర్జున్ తో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, ఈసారి తామిద్దరి కాంబోలో అల ని మించేలా ఒక అద్భుతమైన కథని సిద్ధం చేస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని, అలానే ఇందులో కూడా పూజా హెగ్డే నే హీరోయిన్ గా తీసుకునేందుకు త్రివిక్రమ్ సుముఖత చూపుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ విధంగా వరుసగా తన సినిమాల్లో పూజా హెగ్డే నే తీసుకుంటున్న త్రివిక్రమ్ పై కొందరు నెటిజన్లు, అసలు ఈ పూజా జపం ఎప్పుడు ఆపుతారు త్రివిక్రమ్ గారు అంటూ ఆయనని ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ, అసలు పూజా హెగ్డేనే ఇందులో కూడా హీరోయిన్ గా నటించనుందో లేదో తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: