సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అవ్వగానే రెమ్యునరేషన్లు ఒక్కసారిగా పెంచేస్తుంటారు. ఇక అప్పట్లో స్టార్ హీరోలకు ఒక సినిమాకు రు. 10 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే వామ్మో అని అనుకుంటూ ఉండేవారు. అయితే 1990వ దశకం నుంచి క్రమక్రమంగా హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోతూ వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న హీరోలు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటే అప్పటి స్టార్ హీరోలు ఎంత తీసుకున్నారో ఒక్కసారి చూద్దామా.

తెలుగు ఇండస్ట్రీ మూలపురుషుడు ఎన్టీఆర్‌ అప్పట్లో సినిమా చేయాలంటే రు. 40 లక్షలు బడ్జెట్ లో ఉండేదంట. ఆ సినిమాని సెట్స్ వేసి.. కాస్త భారీగా తీయాలంటే మరో రు. 10 లక్షల వరకు అయ్యేదంట. ఇక అందుకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రు. 12 లక్షల వరకు ఉండదని సమాచారం. ఆయన పారితోషికంలాగే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్పట్లోనే రు. కోటి నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టేవాని సమాచారం. అలాగే ఇండస్ట్రీకి మరో మూలపురుషుడు ఏఎన్నార్‌ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన సాంఘీక సినిమాలకు బడ్జెట్ రు. 30 కోట్లు ఉండగా.. ఏఎన్నార్ రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు తీసుకునేవారంట.

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారని సమాచారం. ఇక ఆయన సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవారంట. అయితే కృష్ణ తన సినిమా ప్లాప్ అయ్యి.. నిర్మాతలకు నష్టాలు వస్తే వెంటనే అదే నిర్మాతలకు కృష్ణ డేట్లు ఇచ్చి మరో సినిమా చేసి పెట్టేవారాని చెబుతుంటారు. అంతేకాక కృష్ణని నిర్మాత హీరో అని కూడా అంటుండేవారు. ఇక వెండితెర సోగ్గాడు శోభన్‌బాబు సినిమా బడ్జెట్ 20 లక్షలు అయితే అందులో 6-7 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకునేవారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: