చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాన్’. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చిత్రీకరించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా వరకు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ జాబితాలో మహాన్ మూవీ కూడా చేరింది. అయితే చాలా వరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మహాన్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది.


మహాన్ సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌గా తండ్రి, అతని కొడుకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా ఇది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో రియల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ద్వారా విక్రమ్ తన కొడుకు అయిన ధ్రువ్ విక్రమ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా..? ఎప్పుడు థియేటర్‌లో చూడాలా..? అని ఫ్యాన్ తెగ ఆరాటపడుతున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితిలో లేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది.


వాస్తవానికి మహాన్ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 2016లోనే విక్రమ్‌కు స్టోరీ చెప్పాడు. కానీ అప్పటికే విక్రమ్ ‘ఇంకొక్కడు’ సినిమా షూటింగ్‌లో బిజీ ఉండటం వల్ల సినిమా పట్టాలెక్కలేదు. చివరకు 2020లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ మేరకు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి 10వ తేదీన మహాన్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే తండ్రీకొడుకుల నటనను థియేటర్లలో చూడాలనే వారికి నిరాశ మిగిలినట్లు సమాచారం. ఓటీటీలో ఈ సినిమాను చూడాలని అనుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: