కోలీవుడ్ అగ్ర నటుడు కమల్ హాసన్ కి సౌత్ సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కమల్ సినిమా వస్తుందంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.ఇక కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విక్రమ్'. ఖైదీ, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ అగ్ర హీరో ఫాహాద్ ఫాజిల్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఇక సినిమాలో కమల్ హాసన్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాని సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్తో ఆర్ మహేంద్ర మరియు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి డిజిటల్ శాటిలైట్ హక్కుల కలిపి దాదాపు 115 కోట్ల కు ఓ ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర టీం తో ఆ సంస్థ చర్చలు జరిపి భారీ మొత్తానికి సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మరి ఇదే కనుక నిజమైతే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరగకముందే చిత్రానికి ఐదు కోట్ల లాభాలు వచ్చినట్లే అని చెప్పవచ్చు. అంటే విడుదలకు ముందే విక్రమ్ సినిమా నిర్మాతలు లాభాల బాట పట్టినట్లే అన్నమాట. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో లో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించడంతోనే ఈ సినిమాకి ఈ రేంజిలో డీల్ కుదిరిందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: