‘ఆర్ ఆర్ ఆర్’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి ఈమూవీ ప్రమోషన్ ను మరింత పెంచి తన డ్రీమ్ ఫిగర్ 1000 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాడు. దీనిలో భాగంగా ఈమూవీ ప్రమోషన్ ను మరింత ఉదృతం చేసి మరొక రెండు వారాలు ఈమూవీ ప్రమోషన్ తో హోరెత్తి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఒక భారీ సినిమాను జనానికి నచ్చే విధంలా ఎలా తీయాలో తెలిసిన జక్కన్నకు ఆమూవీని చూడటానికి సగటు ప్రేక్షకుడు టివీ లను ఓటీటీ లను వదిలి ధియేటర్లకు ఎలా రప్పించుకోవాలో బాగా తెలుసు. తన సినిమాలో నటించే నటీనటులను ఒక వజ్రాన్ని సాన పెట్టే విధంగా తయారుచేసే జక్కన్న తాను సినిమాలలో ఎందుకు నటించాడు అన్న సందేహాలు చాలామందికి వస్తాయి.
గతంలో దాసరి విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మెప్పించారు. దీనితో రాజమౌళి కూడ అలా నటించవచ్చు కదా అన్న కోరిక చాలామందిలో ఉంది. ఈప్రశ్న జక్కన్నకు ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎదురైంది. తాను గతంలో నటించానని అయితే ఈవిషయం చాలామందికి తెలియదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
1983 ప్రాంతంలో తనకు సుమారు 12 సంవత్సరాలు ఉండే ఆనాటి రోజులలో ‘పిల్లన గ్రోవి’ నటించిన విషయం బయటపెట్టాడు. అయితే ఆసినిమా విడుదల కాలేదనీ ఒకవేళ ఆసినిమా అప్పట్లో విడుదలై ఉంటే తాను నటుడుగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తూ దర్శకుడుగా మారే వాడినో లేదో అంటూ జోక్ చేసాడు. ఒకవిధంగా ఆసినిమా విడుదల కాకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అదృష్టం అనుకోవాలి. ఆసినిమా విడుదలై రాజమౌళి నటుడుగా మారి ఉంటే ఒక గొప్ప దర్శకుడును తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయి ఉండేది. దీనితో రాజమౌళి దర్శకుడు అవ్వకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 1000 కల కలగానే మిగిలి ఉండేది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి