సినిమా పరిశ్రమ ఎంత పెద్దదో తెలిసిందే. ఎందరో ఈ సినిమా పరిశ్రమపై ప్రత్యక్షముగా పరోక్షముగా ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇలా చల్లగా ఉన్న సినిమా పరిశ్రమ వర్గాలను అకారణంగా కరోనా అనే పెనుభూతం వచ్చి తీవ్ర ఇబ్బందులను పెట్టింది. దీనితో గడిచిన మూడు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ చాలా కష్ట నష్టాలను ఎదుర్కొంది. అయితే అన్నీ సర్దుకుని గత కొంత కాలంగా మళ్ళీ యధావిధిగా లాభాల్లో టాలీవుడ్ సాగుతోంది. అయితే టాలీవుడ్ లో రాను రాను పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకు భారీ బడ్జెట్ లు అవసరం అవుతున్నాయి. ఒక్కో సినిమాకు ౫౦౦ నుండి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు.

అయితే ఇలా పెట్టిన ఖర్చు అంతా తిరిగి కలెక్షన్ ల రూపంలో వస్తేనే సినిమా హిట్ అవుతుంది అంతే కాకుండా నిర్మాత బాగుపడతాడు. అందుకోసం సినిమా టికెట్ ధరలను కొంతమేరకు పెంచడానికి ప్రభుత్వాన్ని అనుమతి అడిగింది. అయితే వారు కూడా నిర్మాతలు నష్టపోకూడదు అన్న భావనతో పెద్ద మనసు చేసుకుని సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల వరకు అనుమతి ఇచ్చారు. కానీ ఇలా పెరిగిన దరల కారణంగా కొందరు ప్రేక్షకులు సినిమాను అసలు చూడరని సినిమా పరిశ్రమ ఊహించలేకపోయింది. ఇప్పుడు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తోంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కొంతమంది మాత్రమే మొదటి రోజు థియేటర్ లకు వస్తున్నారు.

చాలా మంది వరకు ఆ కొద్ది రోజులు ఆగితే ధరలు తగ్గుతాయి అప్పుడు చూడొచ్చు అని గమ్మగున్నారు. అందుకు కలెక్షన్ లు ముఖ్యంగా మొదటి వారం రోజులు కీలకం అప్పుడే జనాలు రాకుంటే.. సినిమా ఎక్కడ హిట్ అవుద్ది? అందుకే కొన్ని సినిమాలు ప్లాప్ లుగా మిగిలిపోతున్నాయి. మరి ఇంత చిన్న లాజిక్ ను అంత పెద్ద పరిశ్రమ ఎలా మిస్ అయింది అనేది ఇప్పటీకే అర్ధం కానీ ప్రశ్నగా మిగిలింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: