విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు హీరో శ్రీ విష్ణు. హీరో గా చేసే సినిమాలు ఫ్లాపులు ,సక్సెస్ సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా "భళా తందనాన" చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. ఇక ఈ సినిమాని చైతన్య దంతులూరి అనే డైరెక్టర్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం మే 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా విడుదల కావడంతో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. కొంతమందికి ఈ సినిమా విడుదలైన సంగతి కూడా తెలియదు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ వంటి విడుదలైన కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బయ్యర్లకు ఎన్ని కోట్లు నష్టాన్ని తెచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.


1). నైజాం-9 లక్షలు
2). సీడెడ్-6 లక్షలు
3). ఉత్తరాంధ్ర-5 లక్షలు
4). ఈస్ట్-2 లక్షలు
5). వెస్ట్-2 లక్షలు
6). గుంటూరు-6 లక్షలు
7). నెల్లూరు-1లక్షలు
8). కృష్ణ-2 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.33 లక్ష రూపాయల వరకు రాబట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-2 లక్షల రూపాయలు.
11). ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.35 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.

భళా తందాన చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.2.99 కోట్ల రూపాయలు జరగగా ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే రూ.3 కోట్ల రూపాయలను రాబట్టాలి. కానీ ఈ సినిమా ముగిసే సమయానికి రూ.35 కలక్షన్ ని రాబట్టడం తో ఈ సినిమా తో దాదాపుగా బయ్యర్లు రూ.2.64 కోట్ల నష్టాన్ని చవి చూశారు. దీంతో శ్రీ విష్ణు ఖాతాలో మరొక డిజాస్టర్ మూవీ పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: