‘ఆచార్య’ విడుదల అయ్యేంతవరకు టాప్ హీరోల సినిమాల మొదటిరోజు మొదటి ఆటకు విపరీతంగా ధియేటర్స్ కెపాసిటీ మించి జనం కనిపించేవారు. అయితే చిరంజీవి చరణ్ లు నటించిన ‘ఆచార్య’ మూవీ మొదటిరోజు మొదటి షోకు హైదరాబాద్ లాంటి మహానగరంలో సెంటర్లలో ఉన్న ధియేటర్లు కూడ కొన్ని సందడి లేకుండా కన్పించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


‘ఆచార్య’ తో మొదలైన ఈ ట్రెండ్ లేటెస్ట్ గా విడుదలైన ‘సర్కారు వారి పాట’ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోలో కనిపించింది అంటున్నారు. ఈసినిమాకు సంబంధించిన టిక్కెట్స్ రెండు మూడు వరసలు విడుదల రోజునే మిగిలిపోవడంతో అసలు టాప్ హీరోల సినిమాల పట్ల ప్రేక్షకుల ఆదరణ తగ్గిందా లేకుంటే పెంచిన టిక్కెట్ల రేట్ల ధరలతో జనం సినిమాలను పూర్తిగా దూరం పెడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.


‘ఆచార్య’ మొదటిరోజునే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంటే ‘సర్కారు వారి పాట’ కు మొదటిరోజు మొదటి షో నుండే డివైడ్ టాక్ వచ్చింది. ‘కేజీ ఎఫ్ 2’ సినిమాలు తప్ప మరే సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో భారీ కలక్షన్స్ రాలేదు. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలకు ఆమూవీ టాక్ తో సంబంధం లేకుండా కనీసం మొదటి మూడు నాలుగు రోజులైనా భారీ కలక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు.


దీనితో రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాల మార్కెట్ కు భారీ గండి పడే ఆస్కారం ఉంది. ‘ఆచార్య’ మూవీని కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ‘సర్కారు వారి పాట బయ్యర్లకు కూడ వారుపెట్టిన పెట్టుబడి పూర్తిగా తిరిగి రావడం కష్టం అంటున్నారు. దీనితో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది అన్న ఆతృతతో పాటు ప్రేక్షకులు కూడ నెలకు ఒక పెద్ద భారీ సినిమా తప్పించి మరొక సినిమా ఎంతో బాగుంటే కానీ చూసే ఆలోచనలలో లేరా అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: