దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.  మొదట ఇండియాలో  హిందీ లో ప్రారంభం అయిన బిగ్ బాస్ రియాల్టీ షో హిందీ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ఆ తర్వాత దేశంలోని పలు భాషలలో కూడా ఈ రియాల్టీ షో ను ప్రారంభించారు. అందులో భాగంగా తెలుగులో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ను ప్రారంభించారు. మొదట తెలుగులో బుల్లితెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే బుల్లితెరపై ఐదు సీజన్ లను పూర్తి చేసుకుంది.  

ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో ను 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రసారం చేసే ఉద్దేశంతో 'ఓ టి టి' లో ప్రారంభించారు.  ఫిబ్రవరి 26 వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ 'ఓ టి టి' రియాలిటీ షో కు ఈ రోజు అనగా మే 20 వ తేదీన శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ 'ఓ టి టి' రియాలిటీ షో లో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్‌, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్‌ సార్థక్, బిందు మాధవి నిలిచారు. 

రియాల్టీ షో లో అరియానా గ్లోరి రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ 'ఓ టి టి' నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ కూడా బిగ్ బాస్ 'ఓ టి టి' హౌస్ నుండి బయటకు వెళ్ళాడు.  ఆ తర్వాత బిగ్ బాస్ టాప్ 2 కంటెస్టెంట్ లుగా బిందు మాధవి , అఖిల్ సార్ధక్ నిలిచారు.  వారిద్దరిలో నుంచి నాగార్జున చివరగా బిందు మాధవి ని విన్నర్ బిగ్ బాస్ 'ఓ టి టి' విన్నర్ గా డిసైడ్ చేశాడు. అలా బిందు మాధవి బిగ్ బాస్ 'ఓ టి టి' లో విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: