టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతున్నారు. ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్ నైట్ లో నే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇక ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోయిన్లు సైతం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది ఈయనతో సినిమా చేయడానికి ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తిరస్కరించిందట. ఇక ఆమె ఎవరు.. ఎందుకు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.. అనే విషయాలను ఇప్పుడు ఒక్క సారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.చందమామ సినిమా ద్వారా బాగా పాపులారిటీ ని సొంతం చేసుకున్న కాజల్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో మంచి ఇమేజ్ నున్ సొంతం చేసుకుంది. తర్వాత  తన సినీ కెరీర్లో ఈమె వెనుతిరిగి చూడలేదు అని చెప్పవచ్చు. ఇక  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ మంచి ఫామ్ లో  ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు ఇంటీరియర్ డిజైనర్ అయినటువంటి గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఇకపోతే ఇటీవల మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.ఇదిలా ఉండగా కాజల్ ఇదివరకే డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మనకు తెలిసింది. ఈ రెండు సినిమాలలో కూడా వీరి కాంబినేషన్ బాగా సెట్ అయింది అని చెప్పవచ్చు. ఇక ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని ఎంతో మంది దర్శకులు ప్రయత్నించారు. కానీ కుదరలేదు . మొన్న మధ్య వచ్చిన రెబల్ సినిమా లో కాజల్ ని అడిగినా ఆమె ఒప్పుకోలేదు . ఆ తర్వాత మొన్నటికి మొన్న సాహో సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం కూడా కాజల్ ని అడగగా అప్పుడు కూడా ఆమె నో అని చెప్పింది. బిడ్డ జన్మించక ముందు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్న కాజల్ ప్రభాస్ తో ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: