కన్నడ సినిమా పరిశ్రమలో ఇప్పుడు యశ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కేవలం రెండు సినిమాల్తోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. 2018 లో వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 తో వచ్చిన యశ్... ఇండియా అంతటా తన ప్రభంజనాన్ని సృష్టించాడు. అయితే ఇందులో యశ్ ను ఏ స్థాయిలో చూపించాడు అన్నది తెలియాలంటే ప్రశాంత్ నీల్ నే మనము అడగాలి. ఎందుకంటే.... ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ తానై సినిమాను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 అయితే ఇక మాములుగా లేదు. మాస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది ఈ సినిమా.

ఇప్పటి వరకు కన్నడ సినిమా అంటే అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రశాంత్ నీల్ కన్నడ సినిమాను అందరి నోట పలికించాడు.  ప్రస్తుతం యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు లైన్ లో ఉన్నారు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ యశ్ తోనే ప్రశాంత్ నీల్  చాప్టర్ 3 ని తెరకెక్కిస్తారట. ఇదిలా ఉంటే... కన్నడ సినిమా పరిశ్రమలో యశ్ కు వచ్చిన పేరును వాడుకోవడానికి కొందరు నిర్మాతలు సిద్ధం అయిపోయారు. ఇంతకు ముందు యశ్ నుండి వచ్చిన సినిమాలను డబ్ చేసి తెలుగులో విడుదల చేయడానికి చూస్తున్నారు. అందులో భాగంగానే లక్కీ స్టార్ సినిమాను అనువదిస్తున్నారు.

సినిమా 2012 లో యశ్ మరియు రమ్య లు హీరో హీరోయిన్ లుగా వచ్చింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ మూవీగా తెలుస్తోంది. ఈ సినిమాను రాధికా కుమారస్వామి సమర్పించగా రవి రాజు తెలుగులోకి తీసుకువస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రజలను ఆకట్టుకుంటుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: