తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడడం.. బిజినెస్ కూడా మునుపటి కంటే ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అంతా సినిమాల పరంగా స్పీడ్ పెంచేస్తున్నారు. ఇక ఒక్కో హీరో రెండు మూడు సినిమాలకు మించి నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా షూటింగ్ ల విషయం లో చాలా స్పీడ్ పెంచేశారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టుల షూటింగ్ లో ఎవరెవరు.. ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారు..? ఏ లొకేషన్ లో ఉన్నారు..? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరెవరు ఎక్కడ ఏ షూటింగ్ చేస్తున్నారు అనే విషయం ఒకసారి తెలుసుకుందాం..

కే జి ఎఫ్ 2  తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది . శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ప్రభాస్ అక్కడ పాల్గొని పలు కీలక ఘట్టాలను చిత్రీకరించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ వేశారని కూడా సమాచారం.

ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక బై లింగ్వల్ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా తమిళ్ , తెలుగు లో ఏకకాలంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పోతే ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లోని ప్రారంభం కావడం గమనార్హం. అంతేకాదు ఇప్పటికే విజయ్  హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి.. దిల్రాజు శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.

ఇక ఇదే తరహాలో మరొక తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న బై లింగ్వల్ సినిమా సార్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుపుకుంటోంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్.. ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ అలాగే  స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా  సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న దసరా సినిమా  హైదరాబాద్ శివార్లలో ఉన్న బాచుపల్లి లో షూటింగ్ జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: