డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు హీరో అక్కినేని నాగ చైతన్య. ఇందులో చైతన్య పక్కన సాయి పల్లవి నటించింది. ఇక ఈమే నటనతో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటున్నది. ఇందులో చైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో యువ హీరోయిన్స్ అవికాగోర్ , మళావిక కూడా నటిస్తున్నది. ఇక ఇందులో వీరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రం జూలై 8 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించడం జరిగింది చిత్ర బృందం. తాజాగా థాంక్యూ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు.  విడుదలైన థాంక్యూ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. నాగచైతన్య నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే అంటూ వాయిస్ డైలాగ్ తో మొదలవుతుంది.


నాగచైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల కంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ షేడ్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి తాజాగా విడుదలైన థాంక్యూ సినిమా టీజర్ సినిమా పై అక్కినేని అభిమానులు సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ ని పెంచేశాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మజిలీ సినిమా ని మించి పోయేలా కనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: