దళపతి విజయ్ హీరో గా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తున్నది. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రోజున హీరో విజయ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా విడుదల చేయడం జరిగింది చిత్రబృందం.


ముందు తమిళ టైటిల్ ను  వారసి గా  ప్రకటించగా తరువాత తెలుగు టైటిల్ ని వారసుడు గా ప్రకటించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా వారసుడు అనే సినిమా కి బాగా కనెక్ట్ అయి ఉంటుందని ఈ టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ది బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ ను కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరో విజయ్ చాలా స్టైలిష్ లుక్ లో సీరియస్ గా కనిపిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. దీంతో వారసుడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ తో మరొక సారి రుజువు చేశారు. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. బీస్ట్ సినిమా తర్వాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్లు కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: