కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  వరిసు (వారసుడు) అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న అనగా జూన్ 21 వ తేదీన ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ స్టైలిష్ లుక్ లో సూట్ వేసుకొని ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ కు తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా వరిసు (వారసుడు) చిత్ర బృందం విజయ్ కి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది. ఈ సెకండ్ పోస్టర్ లో విజయ్ చిన్న పిల్లలతో కలిసి ఉన్న పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. చిత్ర  బృందం ఈ పోస్టర్ ను విడుదల చేసిన నిమిషాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు విజయ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర బృందం స్పెషల్ గా ఈ సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మీక మందన కథానాయికగా కనిపించబోతోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: